భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధిగా G20 స‌మ్మిట్‌కు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌రణ్‌

భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధిగా G20 స‌మ్మిట్‌కు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌రణ్‌

2023లో భార‌త సినీ ప‌రిశ్ర‌మలో త‌న‌దైన మార్క్‌ను క్రియేట్ చేసి అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు అందుకున్న స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి భార‌త‌దేశానికి గ‌ర్వకార‌ణంగా నిలిచారు. RRRలో అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌ప‌రిచిన అంద‌రి మెప్పును పొందిన ఆయ‌న ప్ర‌శంసల‌ను అందుకున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంద‌రికీ మ‌రింత చేరువ‌య్యారు. శ్రీనగర్‌లో జరుగుత‌న్న‌ G20 సమ్మిట్ – టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌కు భార‌త సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌పున ఆయ‌న ప్ర‌తినిధిగా హాజ‌ర‌య్యారు. త‌ను పాత్ర ఎంత గొప్ప‌దో ఆయ‌న‌కు తెలుసు. ఆయ‌న త‌న స్వఅనుభ‌వాల‌ను ఆయ‌న వివ‌రించారు. అంతే కాకుండా ప్ర‌పంచంలో సినీ చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన ప్రాంతాల్లో మ‌న దేశం యొక్క సామ‌ర్థ్యం గురించి ఆయ‌న గొప్ప‌గా తెలియ‌జేశారు మ‌న‌ గ్లోబల్ స్టార్. ఈ క్ర‌మంలో భారతదేశంలోని గొప్ప‌ సాంస్కృతిక వైవిధ్యం, సుందరమైన ప్రదేశాలు, ఖర్చు, సినిమా…