నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా… సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషా చిత్రం ‘భారతీయన్స్’. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ రచయిత – ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా” ఫేమ్) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు!! ఈ చిత్రాన్ని మాజీ సైనికాధికారుల కోసం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చైనా నీచ బుద్ధిని ఎండగడుతూ… రూపొందిన “భారతీయన్స్” చిత్రం సంచలన విజయం సాధించాలని వారు కోరుకున్నారు. దేశ రక్షణ కోసం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తాము నిర్వర్తించిన విధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని… మాజీ సైనికా దుకారులు…