భగీరథ ‘నాగలాదేవి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్ర బాబు

భగీరథ 'నాగలాదేవి' పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్ర బాబు

విజయ నగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథను జర్నలిస్ట్ , రచయిత భగీరథ ఎన్నో ఏళ్ళు పరిశోధన చేసి ‘నాగలాదేవి ‘ పేరుతో పుస్తకంగా వెలువరించారని, అతని ప్రయత్నాన్ని తాను అభినందిస్తున్నానని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు చెప్పారు . జర్నలిస్టు భగీరథ రచించిన ‘నాగలాదేవి ‘ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఆదివారం రోజు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 44 ఏళ్ళుగా జర్నలిస్టు భగీరథ తనకు తెలుసునని ఇప్పటివరకు భగీరథ 15 పుస్తకాలను రచించారని , ఇది అతని 16వ పుస్తకమని చంద్రబాబు పేర్కొన్నారు . తిరుపతికి సమీపంలోని నాగలాపురం అనే పల్లెటూరుకు చెందిన నాగలాదేవి ని శ్రీకృష్ణదేవరాయలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వివాహం తరువాత ఆమె పేరును చిన్నాదేవిగా మార్చాడని…