ఫ‌న్ రైడ‌ర్‌గా ఆకట్టుకుంటోన్న ‘ప్రేమ్ కుమార్’ ట్రైలర్!

Impressive Trailer Of Santosh Soban Starrer 'Prem Kumar' Promises A Fun Rider

టాలీవుడ్‌లో కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ ప్రేమ్‌కుమార్‌గా న‌వ్వుల్లో ముంచెత్త‌టానికి సిద్ధ‌మవుతున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. ఈ చిత్రం ద్వారా నటుడు, రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ప్రేమ్ కుమార్ వ్య‌థ పేరుతో ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌టం ఆసక్తిక‌రంగా ఉంది. అస‌లు హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. హీరో పెళ్లి వ‌య‌సు వ‌చ్చింద‌ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు.…