సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మొదట్లో సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేశారు. ‘నారప్ప’లో అద్భుతమైన టేకింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండను అందించిన ద్వారకా క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి చేస్తున్న’పెద్ద కాపు-1’ కోసం గేర్ మార్చారు. ఈ న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామాలో విరాట్ కర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్.. ఈరోజు టీజర్‌ను విడుదల చేశారు. తన గత సినిమాలకు భిన్నంగా ఇంటెన్స్, పొలిటికల్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరిచారు శ్రీకాంత్ అడ్డాల. ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ చేసిన ప్రముఖ రాజకీయ ప్రసంగంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల ఆధిపత్యం ఉన్న గ్రామంలో ఒక సాధారణ వ్యక్తి పాలనను చేపట్టడం అనేది…