నరేష్ వికె, పవిత్ర లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ టీజర్ ఏప్రిల్ 13న విడుదల

Dr Naresh VK, Pavitra Lokesh, MS Raju, Vijaya Krishna Movies Telugu-Kannada Bilingual Malli Pelli Teaser On April 13th

నవరసరాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్లీ పెళ్లి’ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రానికి మెగా మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌, గ్లింప్స్ లో లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ రోజు ఈ చిత్రం టీజర్ గురించి ఎక్సయిటింగ్ అప్‌డేట్‌తో వచ్చారు. టీజర్ ఏప్రిల్ 13న విడుదల కానుంది. నరేష్, విత్ర లోకేష్ అందమైన చిరునవ్వుతో లవ్ సింబల్స్ చూపిస్తూ కనిపించారు. నరేష్ సూట్ వేసుకోగా, పవిత్ర లోకేష్ చీరలో ఆకట్టుకున్నారు. జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత…