నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ ZEE స్టూడియోస్ సౌత్ మరియు వండర్ బార్ ఫిల్మ్స్ నిర్మించే కొత్త ప్రాజెక్ట్ కోసం వారి బ్లాక్ బస్టర్ మూవీ ‘కర్ణన్’ తర్వాత మరోసారి చేతులు కలిపారు. బ్లాక్ బస్టర్ కర్ణన్ రెండవ వార్షికోత్సవం పురస్కరించుకుని మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఈ రోజు అధికారికం గా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్, నటుడు ధనుష్ కెరీర్ లో పెద్ద కాన్వాస్ పై రూపొందించిన అత్యధిక బడ్జెట్ సినిమాలలో ఒకటి కానుంది. ఈ చిత్రం తో ధనుష్ సొంత బ్యానర్ వండర్బార్ ఫిల్మ్స్ చలనచిత్ర నిర్మాణంలోకి తిరిగి రావడం ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ZEE స్టూడియోస్ మరియు వండర్బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో విభిన్న పరిశ్రమలకు చెందిన…