‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెక్కెం వేణుగోపాల్. సత్యభామ, నేను లోకల్, పాగల్, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్తా మామ, హుషారు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు పొందిన బెక్కెం వేణుగోపాల్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. నేడు (ఏప్రిల్ 27) నిర్మాత బెక్కెం వేణుగోపాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇది. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమైనా వుందా? – నిర్మాతగా బిజీగా వున్నాను. 2006లో అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలిచిత్రం విడుదలైంది. మొదటి చిత్రం టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రంతోనే తొలిసక్సెస్‌ను అందుకున్నాను. అక్కడి నుంచి 16 సంవత్సరాలు గడిచిపోయింది. సినిమా తప్ప వేరే వ్యాపకం, బిజినెస్ నాకు లేదు.…