నితిన్ 32 చిత్రం `ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మేన్‌`

Nithiin, Vakkantham Vamsi Film titled as EXTRA and the first look is Extraordinary

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్ క‌థానాయకుడిగా రూపొందుతోన్న 32వ చిత్రానికి `ఎక్స్‌ట్రా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. `ఆర్డిన‌రీ మేన్‌` ట్యాగ్ లైన్‌. రైట‌ర్ – డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న ఈ చిత్రం ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. హ్యాపినింగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా చిత్రీక‌రణ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.డిఫ‌రెంట్‌గా ఉన్న‌ ఫ‌స్ట్ లుక్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. పోస్ట‌ర్‌లో నితిన్ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌తో క‌నిపిస్తున్నారు. ఓ దానిలో ఆయ‌న హెయిర్ స్టైల్‌, గ‌డ్డంతో సీరియ‌స్‌గా క‌నిపిస్తున్నారు. అదే పోస్ట‌ర్‌లో మ‌రో లుక్‌లో గ‌డ్డం లేకుండా చాలా కూల్‌గా క‌నిపిస్తున్నారు నితిన్‌. పోస్ట‌ర్…