నాగ చైతన్య ‘కస్టడీ’ సెకండ్ సింగిల్ ‘టైమ్‌లెస్ లవ్..’ విడుదల

నాగ చైతన్య 'కస్టడీ' సెకండ్ సింగిల్ 'టైమ్‌లెస్ లవ్..' విడుదల

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. మేకర్స్ ఇప్పటివరకు ఫస్ట్ లుక్, క్యారెక్టర్ పోస్టర్‌ లు, టీజర్, ఫస్ట్ సింగిల్…ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌ తో అలరించారు. ఇప్పుడు చాలా ప్రత్యేకమైన పాట- టైమ్‌లెస్ లవ్ విడుదలైయింది. ఈ రెట్రో థీమ్ మెలోడీని మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచగా యువన్ శంకర్ రాజా అరెంజ్ చేశారు. ఈ సంగీత ద్వయం ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో పాటకు వింటేజ్ వైబ్‌లను తీసుకొచ్చారు. ఇందులో లవ్లీ సాక్సోఫోన్, ఫ్లూట్, ట్రంపెట్, ట్రోంబోన్ బిట్‌లు సంగీత ప్రియులని అలరిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్ ఈ పాటని చాలా అద్భుతంగా ఆలపించారు. వింటేజ్ టచ్ ఇచ్చేలా ఏడు భారీ, వైబ్రెంట్ సెట్స్‌లో పాటని చిత్రీకరించారు. నాగ…