శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. ‘అయలాన్’ ఫస్ట్ లుక్ చూస్తే… శివకార్తికేయన్, పక్కన ఏలియన్ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఈ తరహా సినిమా రావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇంతకు ముందు కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చాయి. అయితే, ఇటువంటి ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రాలేదు. దీపావళి కానుకగా ‘అయలాన్’ను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత కోటపాడి…