లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి చిత్రాలన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే పంథాలో డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ లో మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ గా బ్లడ్ అండ్ చాక్లెట్ చిత్రాన్ని నిర్మించారు. షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ చిత్రాలను రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న వసంతబాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన అర్జున్ దాస్ హీరోగా, దుసరా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ ట్విట్టర్ వేదికగా దిల్ రాజు విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో…