ప్రశాంతమైన కాలనీలో ఉండాలని వచ్చిన ఫ్యామిలీకి వారి పిల్లల వలన ఆ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. చివరికి ఆ తండ్రి పిల్లలకి తోడుగా ఉండి సొసైటీలో తన ఫ్యామిలీని చూసి గర్వపడేలా ఎలా చేసుకున్నాడనే ఒక క్రేజీ ఫ్యామిలీ డ్రామా కథే “డియర్ జిందగి”. రాజారవీంద్ర సమర్పణలో ‘సాయిజా క్రియేషన్స్’, మహా సినిమా పతాకంపై రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్, నటీనటులుగా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిలిం నగర్ దైవ సన్నిదానంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ నటుడు రాజా రవీంద్ర పై క్లాప్…