వీరయ్య అంగ వైక్యలంతో ఇబ్బంది పడుతున్నా కొడుకుని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. వీరయ్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. విమానం ఎక్కాలని ఆలోచనలతో ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవారిని ప్రశ్నిస్తూనే ఉంటారు. తండ్రిని కూడా విమానం ఎక్కించమని బతిమాలాడుకుంటూ ఉంటాడు. బాగా చదువుకుంటే నువ్వే విమానం ఎక్కవచ్చునని కొడుకుతో అంటుంటాడు వీరయ్య. తండ్రీ కొడుకుల మధ్య అసలు ఈ విమానం గోల ఏంటనేది తెలుసుకోవాలంటే ‘విమానం’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేకర్స్. శనివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో మాస్టర్ ధ్రువన్ కొడుకుగా నటిస్తే, తండ్రి పాత్రలో విలక్షణ నటుడు సముద్ర ఖని నటించారు. వీరి మధ్య సాగే విమానం సంభాషణ ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంది. అలాగే సినిమాలో బలమైన ఎమోషనల్ అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ‘నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా…