హార్తీక్ ప్రొడక్షన్స్ పతాకంపై రమణ భార్గవ, పింగ్ పాంగ్ సూర్య, రిమ్‌జిమ్ శర్మ, జోగి బ్రదర్స్ (జోగి నాయుడు, కృష్ణంరాజు) అశోక్ కుమార్, చిన్నా, చిత్రం శీను నటీ నటులుగా హార్తీక్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “డైరెక్టర్ సాబ్”. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి నటుడు అశోక్ కుమార్, తోటపల్లి సాయినాథ్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని డైరెక్టర్ సాబ్” మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. అనంతరం.. ప్రముఖ రచయిత తోటపల్లి సాయినాథ్ మాట్లాడుతూ… దర్శకులు రాజమౌళి గారు తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చి కొత్త దర్శకులకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అలాగే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్…