జూన్ 29న విడుదల కానున్న నిఖిల్ సిద్దార్థ్ ‘స్పై’

జూన్ 29న విడుదల కానున్న నిఖిల్ సిద్దార్థ్ 'స్పై'

యంగ్ టాలెంటెడ్ పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ” 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మరో పాన్ ఇండియా సినిమా “స్పై” తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నికిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “స్పై”. ఈడీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న “స్పై” చిత్రం ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో అజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షాలది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ద స్పూర్తిని నింపిన సుభాష్ చంద్రబోస్.. యుద్దసమయంలో 1945లో ప్లేన్ క్రాష్ కు గురియ్యారు. ఆ ఘటనతో భారతీయ చరిత్ర సుభాష్ చంద్రబోస్ ఆచూకిని కోల్పొయింది. ఇప్పటికీ…