ఇలాంటి పాత్రలు చేయాలంటే దేవుడి పర్మిషన్ ఉండాలి : ‘జయహో రామానుజ’ ఈవెంట్‌లో హీరో సుమన్

ఇలాంటి పాత్రలు చేయాలంటే దేవుడి పర్మిషన్ ఉండాలి : 'జయహో రామానుజ' ఈవెంట్‌లో హీరో సుమన్

సుదర్శనం ప్రొడక్షన్స్ లో జయహో రామానుజ చిత్రాన్ని లయన్ డా. సాయివెంకట్ స్వీయ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రానికి సాయిప్రసన్న ప్రవలిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి బి.సి. కమీషన్ ఛైర్మెన్ వకుళాభరణం కృష్ణ మోహన్ గారు, f.d.c చైర్మెన్ కూర్మాచలం అనీల్ కుమార్ గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి, తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, సుమన్, సింగర్ పద్మ, తుమ్మల రామసత్యనారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి మాట్లాడుతూ.. ‘నాలానే సాయి వెంకట్ కూడా ఎన్నారై. జయహో రామానుజ సినిమా చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఈవెంట్‌కు చిన్నజీయర్ స్వామిని తీసుకురండి. ఆయన…