‘జగమే మాయ’ని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: ‘జగమే మాయ’ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్

'జగమే మాయ'ని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: 'జగమే మాయ' ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్

ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ‘జగమే మాయ’. సునీల్ పుప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్యాపి స్టూడియోస్ బ్యానర్ పై ఉదయ్ కోలా, శేఖర్ అన్నే నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తెలుగు, తమిళ్, హిందీ… అన్నీ భాషల ప్రేక్షకులని అలరించి టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్బంగా.. చైతన్య రావు మాట్లాడుతూ.. మంచి కంటెంట్ వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనడాని మరో ఉదాహరణగా నిలిచింది ‘జగమే మాయ’. నిర్మాత ఉదయ్ గారికి, దర్శకుడు సునీల్ గారికి కృతజ్ఞతలు. చాలా మంచి కంటెంట్ ఇచ్చారు. భవిష్యత్ లో కలసి మరిన్ని సినిమాలు చేస్తాం. తేజ ఐనంపూడి చాలా ప్రతిభ వున్న నటుడు.…