ఆహా ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’ ఐకానిక్ ఫినాలేలో ఫైన‌లిస్ట్ ప‌రిచ‌యం చేసిన త‌మ‌న్‌, కార్తీక్‌, గీతా మాధురి

ఆహా ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’ ఐకానిక్ ఫినాలేలో ఫైన‌లిస్ట్ ప‌రిచ‌యం చేసిన త‌మ‌న్‌, కార్తీక్‌, గీతా మాధురి

తెలుగు సినీ సంగీత ప్రేమికుల‌కు అద్భుత‌మైన సంగీత ప్ర‌తిభ‌ను ప‌రిచ‌యం చేయ‌టంతో పాటు గొప్ప అనుభూతిని అందిస్తోంది తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2. ఇది అతి పెద్దదైన సంగీత కార్య‌క్ర‌మ వేదిక‌. సీజ‌న్ 1 చాలా పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజ‌న్ 2 అంత‌కు మించి భారీ ఆద‌ర‌ణ‌ను పొందుతోంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు యు.ఎస్‌కు చెందిన సింగ‌ర్స్ పార్టిసిపేట్ చేశారు. అల‌రిస్తోన్న ఈ ప్రోగ్రామ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. అందులో భాగంగా ఐకానిక్ పినాలోలో భాగంగా ఫైన‌లిస్టుల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు షో జ‌డ్జెస్ త‌మ‌న్‌, కార్తీక్‌, గీతా మాధురి. ఫైన‌లిస్టులుగా ఎంపికైన‌ కార్తికేయ‌, శ్రుతి, జ‌య‌రాం, లాస్య‌, సౌజ‌న్య భాగ‌వతుల త‌మదైన శ్రావ్య‌మైన గాత్రాల‌తో పాట‌లు పాడి అల‌రించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో.. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ ‘‘చాలా ఎన‌ర్జిటిక్ అండ్ ఎంగేజింగ్…