మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా కొందరు కాలంతోపాటు పరిగెడుతుంటారు, కానీ ఈయన మాత్రం కాలానికి ఒక రెండు అడుగులు ముందే ఉంటారు. ఈయన తీసుకునే కొన్ని నిర్ణయాలు ఊహాతీతం, అవి మొదటి ఆశ్చర్యం కలిగిస్తాయి, కొన్ని రోజులు తరువాత అర్ధమవుతాయి, ఇంకొన్ని రోజులు తరువాత అద్భుతం అనిపిస్తాయి. “ఆహా” లో అన్ స్టాపబుల్ లాగా. ఒక మంచి సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లాలి అని ఆయనకు ఉండే సంకల్పమే నేడు “ఆహా” ఓటిటి ప్లాట్ ఫ్రామ్. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో అందించడం అనేది తెలుగు ప్రేక్షకులకు గొప్ప విషయం. కేవలం ఓటిటిలోనే కాకుండా థియేటర్స్ లో కూడా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 30…