‘కస్టడీ’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కస్టడీ టీం యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటి. కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా ని నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం మే 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. హీరో నాగచైతన్య మాట్లాడుతూ, కస్టడీ సినిమాను ఆదరిస్తున్న తెలుగు సినిమా ఆడియన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.…