యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఏజెంట్ లో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘ఏజెంట్’ లో మీ పాత్ర గురించి చెప్పండి ? – ఇందులో నేను ‘రా’ ఏజెంట్ పాత్ర పోషించాను. అయితే వ్యవస్థలో తనకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థ కు ఎదురుతిగి, వ్యవస్థపై పగ…