గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రెండవసారి చేతులు కలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా మాస్, ఎనర్జిటిక్, డైనమిక్ క్యారెక్టర్ లో కనిపించడం అభిమానులని అలరించింది. ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయిక గా నటిస్తోంది. ఈ రోజు శ్రీలీల బర్త్ డే సందర్భంగా చిత్రం నుంచి ఆమె లుక్ ని విడుదల చేశారు మేకర్స్. అలక, చిరు కోపంతో కనిపిస్తున్న శ్రీలీల క్యూట్…