‘ఉగ్రం’ హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ : డైరెక్టర్ విజయ్ కనకమేడల

‘ఉగ్రం’ హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ : డైరెక్టర్ విజయ్ కనకమేడల

‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌ గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటిచింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో దర్శకుడు విజయ్ కనకమేడల ‘ఉగ్రం’ విశేషాలని మీడియాతో పంచుకున్నారు . # ఉగ్రం ఎలా మొదలైయింది? – ‘నాంది’ మొదటి షెడ్యుల్ అయిన తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ఆరు నెలలు ఖాళీగా కూర్చున్న సమయంలో ఉగ్రం కథ చేసుకున్నాను. ఈ కథ నరేష్ గారికి అయితే బావుంటుందనిపించింది. ఆయన ఎమోషన్స్ చేశారు కానీ…