‘ఇంటింటి రామాయణం’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : చిత్ర బృందం

'ఇంటింటి రామాయణం' చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : చిత్ర బృందం

సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన కుటుంబ కథా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేష్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం(జూన్ 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించి ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు. దర్శకుడు సురేష్ నరెడ్ల మాట్లాడుతూ.. “నిన్ననే ‘ఇంటింటి రామాయణం’ సినిమా థియేటర్లలో విడుదలైంది. చూసిన ప్రేక్షకులందరూ సినిమాని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా నవ్వుకుంటున్నారు, ఎమోషనల్…