ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలు, సిరీస్‌లు, షోస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నెంబర్ వన్‌గా దూసుకెళ్తోన్న లోకల్ ఓటీటీ ‘ఆహా’. ఈ అచ్చ తెలుగు ఓటీటీ మాధ్యమం ప్రతి శుక్రవారం ఓ కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. ఈ శుక్రవారం (జూన్ 9) మరో హిలేరియల్ ఎంటర్ టైనర్ ‘#మెన్ టూ’తో వినోదాన్ని అందించటానిక ఆహా సిద్ధమైంది. నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాధారణంగా భార్యలను భర్తలు చిత్ర హింసలు పెట్టటం అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వచ్చాయి. అయితే పెళ్లి కానీ మగవాళ్లు…