ఆదర్శ’మూర్తి’కి అభినందనలు

ఆదర్శ'మూర్తి'కి అభినందనలు

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మీడియా రంగానికి అలుపెరుగకుండా సేవలందించి, నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచిన సీనియర్ పాత్రికేయులు కే.రామచంద్రమూర్తి గారు 75ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో శనివారం రాత్రి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, ఎమెస్కో సంస్థలు మాదాపూర్ లోని దష్పల హోటల్ లో నిర్వహించిన “అక్షరానికి అమృతోత్సవం” ఆత్మీయ కార్యక్రమం కనుల పండగల జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మీడియా, రాజకీయ, సామాజిక రంగాల నుండి పలువురు ప్రముఖులు హాజరై మూర్తి గారికి శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయత పంచుకున్నారు. ఏపీ మాజీ సీఎస్ కాకి మాధవ రావు, సిపిఐ నేత నారాయణ, సిపిఎం నేత రాఘవులు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేంద్ర ఆర్టీఐ మాజీ కమీషనర్ మాడబుషి శ్రీధర్,…