ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింటిలోకి అడుగు పెట్టాల్సిన అమ్మాయి అత్తగారితో కలిసి ఉండలేనని, వేరు కాపురం పెడతామని పెళ్లికి ముందే ఆ కాబోయే వరుడితో అంటే.. తనకు కాబోయే అత్త ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఆమెతో ఓ వారం ట్రిప్ వెళతానని అమ్మాయి చేసుకోబోయే అబ్బాయితో అంటే.. ఓ వైపు తల్లి.. మరో వైపు కాబోయే భార్య మధ్య ఆ కుర్రాడు ఎలా ఇబ్బంది పడ్డాడనే కథాంశంతో రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married). ఇండియన్ లెజెండ్రీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married)తో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై సాక్షి…