పోటీ ప్రపంచంలో అందరూ ఊరుకులు పరుగులు మీదుంటారు. కానీ ఇవేమీ తెలియని ఓ కుర్రాడు.. జీవితంలో ఏదో సాధించాలనే సంకల్పంతో సిటీలోకి అడుగు పెడతాడు. అతని పేరే అరుణ్ కుమార్. తను కోరుకున్న జీవితాన్ని సాధించాలనుకుని ఇంటర్న్ షిప్ ఉద్యోగంతో హైదరాబాద్‌లోకి అడుగు పెడతాడు. అయితే అక్కడున్న తన కొలీగ్స్ మాత్రం.. ఇంటర్న్ ఉద్యోగి అంటే ప్యూన్ కానీ ప్యూన్ అనేలా అన్నీ పనులు తనతో చేయిస్తారు. ఏదైనా ఆఫీసు పని చెప్పమని అడిగిన ప్రతీసారి అంత ఈజీగా నీకేది దొరకదు అర్థమైందా? అని అందరూ చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడనేది తెలుసుకోవాలంటే జూన్ 30న అచ్చ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ చూడాల్సిందే. శనివారం మేకర్స్ ‘అర్థమైందా అరుణ్‌కుమార్’ టీజర్‌ను…