అల్లు అర్జున్ కు బర్త్ డే శుభాకాంక్షల వెల్లువ !

happy birthday to Allu arjun

మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేటితో (ఏప్రిల్ 8) 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ ఆనందం అభిమానుల్లోనే కాదు… చిత్రసీమలోనూ నెలకొంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు చిత్రసీమకు చెందిన ప్రముఖులెందరో ఐకాన్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్‌ ని ఎంతగానే ఇష్టపడే తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఆయనకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే ‘పుష్ప 2’ లుక్ రాకింగ్ అంటూ ట్వీట్ కూడా చేయడంపై మెగాభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హీరోయిన్ లు రష్మిక మందన్నా, ప్రగ్యా జైస్వాల్ తదితరులు బర్త్ డే విషెస్ తెలిపారు. చిరంజీవి ప్రోత్సాహంతో అల్లు అర్జున్ ‘డాడీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే! ‘స్వాతి ముత్యం’, ‘విజేత’ సినిమాల్లో బాల నటుడిగా నటించిన అల్లు అర్జున్…