అమ్మని ఇష్టపడే వాళ్ళంతా ‘రుద్రుడు’ని ఇష్టపడతారు : రాఘవ లారెన్స్

అమ్మని ఇష్టపడే వాళ్ళంతా 'రుద్రుడు'ని ఇష్టపడతారు : రాఘవ లారెన్స్

యాక్టర్ -కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ‌ఎల్‌ పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రుద్రుడు ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానున్న నేపధ్యంలో రాఘవ లారెన్స్ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. # దర్శకుడు కతిరేసన్ రుద్రుడు కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? – మీ…