తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేందుకు ఓ వైవిధ్యమైన కథతో ముస్తాబు అవుతున్న చిత్రం “ఓఎంజీ”. సంగీతప్రియులను ఉర్రుతలూగించే మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్స్ సమర్పణలో, మార్క్ సెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ అబినికా ఐనభాతుని నిర్మాతగా, శంకర్ మార్తాండ్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “ఓఎమ్ జీ. ఓ మంచి ఘోస్ట్” అనే ట్యాగ్ లైన్ తో హర్రర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రేక్షకులను అలరించాడానకి అనుప్ రుబెన్స్ స్వరపరిచిన ఓ సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. “పైసా రే పైసా” అంటూ సాగే ఈ సాంగ్ మంచి డ్యాన్స్ బీట్ సాంగ్ గా రూపోందించారు మ్యూజిక్ డైరెక్టర్. ఈ…