‘అజయంతే రందం మోషణం’ (ARM) టీజర్ విడుదల

'అజయంతే రందం మోషణం' (ARM) టీజర్ విడుదల

తన సూపర్ హీరో మూవీ మిన్నల్ మురళితో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మలయాళ నటుడు టోవినో థామస్ తన మొదటి పాన్-ఇండియా చిత్రం విడుదలకు సిద్ధంగా వున్నారు. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ‘అజయంతే రందం మోషణం’ (ARM) టీజర్ అన్ని సౌత్ లాంగ్వేజెస్, హిందీలో కూడా విడుదలైంది. పాన్ ఇండియా అప్పీల్‌కు అనుగుణంగా.. ఎఆర్ఎం టీజర్ సోషల్ మీడియాలో గ్రాండ్ లాంచ్ అయ్యింది. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్‌ కోసం ఇండియన్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి , పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి వచ్చారు. హిందీ టీజర్‌ను హృతిక్ రోషన్ లాంచ్ చేయగా, తెలుగులో నాని, తమిళంలో లోకేష్ కనగరాజ్, ఆర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్…