‘బాహుబలి’ చిత్రం తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నారు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ తో పాటు ప్రాజెక్ట్ కె, సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అంటూ మరో మూడు సినిమాలను చేస్తూ ఆయన యమ బిజీగా ఉన్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదలకు శరవేగంగా సిద్ధమవుతోంది. సాహో, రాధేశ్యామ్ చిత్రాల తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా ‘ఆదిపురుష్’ కావడంతో ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రిట్రో ఫైల్స్ సంస్థతో కలిసి టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్,…