24న ‘సుగ్రీవ’

'Sugreeva' on the 24th
Spread the love

ఎస్.జి.ఎస్.వి మూవీస్ పతాకంపై బాలు చరణ్, కాజల్ తివారి హీరో హీరోయిన్ గా నర్తు చిరంజీవి దర్శకత్వం లో ఎమ్.పవన్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుగ్రీవ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ .. ‘సుగ్రీవ’ ఒక అందమైన కుటుంబ కథాచిత్రం. ఆనందంగా జీవిస్తున్న కుటుంబంలో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ కుటుంబం ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుంది? వాళ్ళు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారనేదే కథ. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత ఎమ్.పవన్ కుమార్ ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. నర్తు చిరంజీవి దర్శకత్వం అద్భుతంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి, గోవా.. వైజాగ్ లాంటి అద్భుతమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించాము. సారధి స్టూడియోస్ లో డిఐతో పాటు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 24 న విడుదలకు సిద్ధంగా ఉంది అని తెలిపారు.

Related posts