Srirangaapuram Movie Review : మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శ్రీరంగాపురం’!!

Srirangaapuram Movie Review :
Spread the love

తెలుగు చలనచిత్రసీమలో నేడు వస్తున్న సినిమాల్లో కథ కొంచెం బాగా అనిపించినా ప్రేక్షకులు ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఇది ఎంతో మంచి పరిణామం. ఫలితంగా దర్శక, నిర్మాతలు మరిన్ని చిత్రాలతో మనముందుకొస్త్తున్నారు. వినాయక్ దేశాయ్, పాయెల్ ముఖర్జీ జంటగా శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై చిందనూరు విజయలక్ష్మి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీరంగాపురం’ ఈ కోవలోకి చెందినదే! ఈ చిత్రాన్ని చిందనూరు నాగరాజు నిర్మించారు. ఎం.ఎస్ వాసు దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి సంగీతం స్వర సుందరం. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈచిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళదాం…
కథలోకి… శ్రీరంగాపురం అనే గ్రామంలో పెద్దారెడ్డి (చిందనూరు నాగరాజు), కొండారెడ్డి (సత్య ప్రకాశ్)ల మధ్య పగ, ప్రతీకారాలు చోటుచేసుకుంటాయి. ఓ సారి గ్రామం విషయంలో కొండారెడ్డిని.. పెద్దారెడ్డి తీవ్రంగా అవమానిస్తాడు. దాంతో కొండారెడ్డి గ్రామానికి దూరంగా నివసిస్తూ వుంటాడు. అయితే పెద్దారెడ్డి.. తన మేనకోడలు మహాలక్ష్మి(పాయెల్ ముఖర్జీ)ని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఆమె అదే గ్రామానికి చెందిన పాలు అమ్ముకునే రంగ(వినాయక్ దేశాయ్) అనే యువకుడితో ప్రేమలో పడుతుంది. అదే సమయంలో కొండారెడ్డి కుమారుడు సిద్ధూ (రోబో గణేశ్) మహాలక్ష్మిని ఎంతగానో ఇష్టపడతాడు. ఈ విషయం తెలిసి పెద్దారెడ్డి … పాలమ్ముకునే రంగకి తన మెనకోడలిని ఇవ్వడం కంటే తన కులానికి చెందిన.. పగవాడైన కొండారెడ్డి కుమారునికి ఇచ్చి పెళ్లి చేయడం ఉత్తమం అని భావించి… కొండారెడ్డి ఇంటికి కోడలిని చేస్తానంటూ మాటిస్తాడు. మరి పెద్దారెడ్డి … కొండారెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? మహాలక్ష్మి, రంగాల ప్రేమ ఎక్కడికి దారితీసింది లాంటి తదితర విషయాలు తెలియాలంటే ‘శ్రీరంగాపురం’. సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లోకి అడుగు పట్టాల్సిందే.. సినిమా చూడాల్సిందే…
విశ్లేషణలోకి.. ప్రస్తుతం టాలీవుడ్ లో గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కే కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలే ఎప్పుడూ ప్రేక్షకుల హృదయాలను అతి ;సుకుమారంగా తాకుతాయి. పల్లెల్లో రెండు వర్గాల మధ్య వుండే పగలు, ప్రతీకారాలు… వాటి మధ్యలో ఓ అందమైన ప్రేమ కథ… ఆ ప్రేమ కథకు అడ్డు తగిలే విలన్… ఇలా ఆసక్తికరమైన కథ. కథనాలతో వచ్చే సినిమాలని అన్నివర్గాల ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. తాజాగా ఎం.యస్. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీరంగాపురం’ చిత్రం కూడా ఇలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కిందే. తండ్రి తరువాత తండ్రి లాంటి వాడు మేన మామ. అలాంటి మేనమామ తన మేనకోడలు ప్రేమ విషయంలో ఎలా వ్యవహరించాడు..? ఆమె ప్రేమను గెలిపించడానికి, తాను ఇతరులకు ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి వున్నాడు? అనేది ఈ సినిమాలో ఎంతో చక్కగా అల్లుకున్నారు. ప్రతీ సన్నివేశం హృద్యంగాతెరకెక్కించాడు దర్శకుడు. ప్రతి మేనమామ తన మేనకోడలు పట్ల ఎలా వుండాలి అనేది ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు. సెంటిమెంట్, మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు!
ఎవరెలా చేశారంటే.. ఈ ‘శ్రీరంగాపురం’ చిత్రంతో నూతనంగా పరిచయమైన హీరో వినాయక్ దేశాయ్ మంచి మాస్ కటౌట్ వున్నొడుల అనిపించాడు. ఆ కటౌట్ కు తగ్గట్టే ఈ సినిమాలోని అతని స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ గా ఉంది. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రేమ కథకి చక్కగా కుదిరి పాత్రలో లీనమయ్యాడు. పాత్ర పరిధిమేరకు నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అతడి సరసన నటించిన పాయెల్ ముఖర్జీ గ్రామీణ యువతిగా లంగా ఓణీలో మెప్పించింది. అలాగే యూత్ కి నచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ లోనూ బాగా ఆకట్టుకుంది. ఇద్దరికీ ఇదే తొలి సినిమా. మేనమామగా పెద్దారెడ్డి పాత్రలో ఈ సినిమా నిర్మాత చిందనూరు నాగరాజు భలే మాస్ అప్పీల్స్ తో ఆద్యంతం అలరించి ప్రేక్షకులను విశేషంగాఆకట్టుకున్నాడు. అలాగే అతడు చేసిన మాస్ యాక్షన్ సన్నివేశాలు వండర్ గా ఉన్నాయి. కూతురులా తన మేనకోడలిని ఎంతో ప్రేమించే మేనమామగా… గ్రామంలో ప్రత్యర్థులకు సింహ స్వప్నంలా కనిపించి శెభాష్ అనిపించాడు. రెండు వేరియేషన్స్ లో బాగా అనుభవం వున్న నటుడిగా పాత్రను పండించాడు. విలన్ పాత్రలో సత్య ప్రకాశ్ తన దైన శైలిలో నటించాడు. అతడి కొడుకుగా రోబో గణేశ్ సైకో పాత్రలో వాహ్.. అనిపించాడు. మిగతా పాత్రలలో నటించిన చిత్రం శ్రీను, జబర్దస్త్ రాజమౌళి, శ్రావణ సంధ్య, వైష్ణవి సింగ్, గీతా సింగ్, దుర్గారావు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి ప్రేక్షకుల మెప్పును పొంది తం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మొత్తం మీద ఈ చిత్రానికి దర్శకుడు వాసు రాసుకున్న కథ.. కథనాలు బాగా సూటయ్యాయి. మాస్ ని మెప్పించే అన్ని అంశాలు వుండే లా ప్రతీ సన్నివేశాన్ని ఆద్యంతం ఆసక్తి కలిగించేలా చిత్రీకరించారు. సాంకేతిక విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ సూపర్. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా తన కెమెరాలో బంధించాడు. అలాగే హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీని బాగా క్యాప్చర్ చేశారు. పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. వేటికవే బాగున్నాయి. ఎడిటింగ్ ఒకే అనిపించింది. ఇంకో ముఖ్యమైన విషయం.. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా స్థాయిని పెంచాలన్నా, దించాలన్న ఇవే కాబట్టి. ఈ ‘శ్రీ రంగాపురం’ విషయానికొస్తే.. ఆ విలువలు స్పష్టంగా కనిపిస్తాయి. సినిమా బాగా రావడానికి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ పెట్టినట్టు తెరపై ఇట్టే కనిపించింది. సో.. ఫ్రెండ్స్.. ఈ ‘శ్రీ రంగాపురం’ సినిమాని ఓసారి ఓ లుక్కేయండి!! తనివితీరా ఆస్వాదించి వినోదంలో మునిగి తేలండి మరి!!

రేటింగ్: 3

Related posts

Leave a Comment