‘రాళ్లపాటి బ్రదర్స్ పిక్చర్స్’ ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ పూర్తి

Shooting for ‘Rallapati Brothers Pictures’ Production No. 1 completed
Shooting for ‘Rallapati Brothers Pictures’ Production No. 1 completed
Spread the love

త్వరలోనే గ్రాండ్‌గా టైటిల్ రివీల్!
రాళ్లపాటి బ్రదర్స్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ‘ప్రొడక్షన్ నంబర్ 1’. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్లు, వినోదాత్మక చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అదే బాటలో, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. రాళ్లపాటి చిన్న మస్తాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధీరావత్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని అత్యంత గ్రాండ్‌గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం తుది విడత పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా జరుపుకుంటోంది. సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా, నమ్మకంగా ఉంది. ఈ సందర్భంగా త్వరలోనే గ్రాండ్ లెవెల్ లో సినిమా ‘టైటిల్ లాంచ్’ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ కాలం కుర్రాళ్లు పెళ్లి విషయంలో తొందరపడి చేసిన ఒక చిన్న తప్పు ఎలాంటి విచిత్రమైన పరిణామాలకు దారితీసింది? దానివల్ల ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డారనే పాయింట్‌ను నవ్వుల పూదోటలా తెరకెక్కించారు దర్శకుడు. పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో రెండు గంటల పాటు ప్రేక్షకులకు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను, సరికొత్త అనుభూతిని అందించడం ఖాయం. ఈ చిత్రంలో నవీన్, మౌనిక, రేఖ, ఆశిష్, చేతన్, సన్నీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రతీ ఒక్కరి పాత్ర చాలా డిఫరెంట్‌గా, నవ్వులు పూయించేలా ఉంటుంది. విజువల్స్, వినోదం మరియు యూత్ కూల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య అద్భుతమైన స్వరాలను అందించారు. సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండగా, ప్రతి పాట వినసొంపుగా, విజువల్‌గా కంటికి ఇంపుగా వచ్చాయి. ప్రమోషన్లలో ఈ పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది. ఆకట్టుకునే కెమెరా వర్క్, ఆర్టిస్టుల అద్భుత నటన, మనసును ఆకట్టుకునే సంగీతం కలగలిపిన ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని సెన్సేషనల్ అప్‌డేట్స్‌ను మూవీ టీమ్ త్వరలోనే వెల్లడించనుంది.
నవీన్, మౌనిక, రేఖ, ఆశిష్, చేతన్, సన్నీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యానర్: రాళ్లపాటి బ్రదర్స్ పిక్చర్స్, నిర్మాత: రాళ్లపాటి చిన్న మస్తాన్, దర్శకత్వం: ధీరావత్ భాస్కర్, సంగీతం: వినోద్ యాజమాన్య, డి.ఓ.పి (DOP): రాఘవేంద్ర బి కొల్లార్, ఎడిటర్: రామారావు, డి.ఐ (D.I): శ్రీ, కొరియోగ్రఫీ: బాలకృష్ణ, సాగర్, A.M.R., పీఆర్ఓ: బాబు నాయక్.