సికింద్రాబాద్ జై స్వరాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.జె థామస్

Secunderabad Jai Swaraj Party MP candidate RSJ Thomas
Spread the love

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ ఎస్ జె థామస్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావుగౌడ్ ఖరారు చేశారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన థామస్ సీనియర్ జర్నలిస్ట్, అలాగే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజం పట్ల ఆయనకు ఉన్న సేవా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుని థామస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు కాసాని తెలిపారు. సికింద్రాబాద్ లో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ సమావేశాల్లో థామస్ ను కండువా కప్పి పార్టీలోకి కాసాని ఆహ్వానించారు. అనాధలు, అభాగ్యులు, పేదలకు తన ఎన్జీఓ సంస్థ ద్వారా సేవలు అందించే థామస్ జై స్వరాజ్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. సామాన్య ప్రజల సమస్యలను మరింతగా పరిష్కరించాలంటే రాజకీయాల ద్వారానే సాధ్యమని ఆలోచించి జై స్వరాజ్ పార్టీలో చేరానని ఆర్ ఎస్ జె థామస్ అన్నారు. తన పట్ల నమ్మకంతో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఖరారు చేసిన జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావుగౌడ్ కు థామస్ ధన్యవాదాలు తెలిపారు.దేశంలో పేదవాడు లేకుండా అందరికీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగేందుకు తమ పార్టీ పనిచేస్తుందని జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ అన్నారుb మెట్టుగూడలోని ప్రధాన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తాము పేదవాడికి సౌకర్యాలు కల్పించేందుకు వైద్య విద్య గృహవాసతులాంటి కనీస సౌకర్యాలు కల్పిస్తూ దేశంలో పేదరిక నిర్మూలించేందుకు పనిచేస్తామని తమ ఏజెండాతో తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో అన్ని అసెంబ్లీ స్థానాలకు పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయనున్నట్లు జై స్వరాజ్ పార్టీ నుంచి ఎనిమిది మంది అభ్యర్థులను ఆయన ప్రకటించారు ఈ అభ్యర్థులంతా తమ మేనిఫెస్టో ప్రకారం ప్రజలకు సేవ చేస్తారని ఆయన వెల్లడించారు తాము రాజకీయంగా పార్టీ పరంగా వెనకబడి ఉన్నప్పటికీ సిద్ధాంతపరంగా లక్ష్యాన్ని చేరుకుంటామని గతంలో పనిచేసిన పార్టీలన్నీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయయని అలా కాకుండా మేము రాజకీయాల్లో స్థిరంగా ముందుకెళ్తావివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి పరుష రాములు గౌడ్ , RSJ థామస్ మార్ల ఆంజనేయులు తదితరులు మాట్లాడారు

Related posts

Leave a Comment