కోతి కొమ్మచ్చి సినిమా మొదలైంది

satish vegesna kothi kommachi movie launched
Spread the love

మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’ . లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన నిర్మాత దిల్ రాజు మొదటి షాట్‌కి క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

అనంతరం దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ… “యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న మా చిత్రాన్ని విజయదశమి పర్వదినం రోజు ప్రారంభించడం జరిగింది. నవంబర్ 3 నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు పెడతాము. ఆ తర్వాత వైజాగ్‌లో కొంత పార్ట్ షూట్ చేయబోతున్నాము. ఒకే షెడ్యుల్‌లో సినిమాను పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాము.” అని తెలిపారు.

నిర్మాత ఎం ఎల్ వి సత్యానారాయణ మాట్లాడుతూ… ” సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. వేగేశ్న సతీష్ గారు మా బ్యానర్‌లో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేఘమ్ష్ శ్రీహరి, సమీర్‌లకు ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నాము.” అన్నారు.

“త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనబోతున్నాం. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ప్రేక్షకుల ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాం” అని కథానాయకులు మేఘమ్ష్ శ్రీహరి, సమీర్ వేగేశ్న ఆకాక్షించారు.

రిద్ది కుమార్, మేఘ చౌధురి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

Related posts

Leave a Comment