సంపూని ‘సోదరా’ అంటున్న యువ హీరో సంజోష్!

Sanjosh, the young hero who calls Sampooni 'brother'!
Spread the love

వెండితెరపై రాణిస్తున్న వరంగల్ హీరో…!

వెండితెరపై రాణించాలంటే సాధారణ విషయం కాదు. ఎంతో టాలెంట్ ఉంటే గానీ ఆడిషన్స్ లో మెప్పించలేరు. మంచి మంచి ఫిలిం అకాడమీల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లే వెండితెరపై ఛాన్సుల కోసం అహోరాత్రులు ఎదురు చూస్తుంటారు. సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోవడానికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వరంగల్ కుర్రాడు మాత్రం తనకున్న టాలెంట్ తో వెండితెరపై దూసుకుపోతున్నాడు. ఫిలిం బ్యాగ్రౌండ్ ఏమీ లేకున్నా… కేవలం సినిమాల్లో నటించాలనే ప్యాషన్ తో వెండితెరవైపు అడుగులు వేసిన ఈ యంగ్ హీరో పేరు సంజోష్. హిమాచల్ ప్రదేశ్ లో ‘మండి స్కూల్ ఆఫ్ డ్రామా’లో వర్క్ షాప్స్ చేసి… ఆ తరువాత అనేక వర్క్స్ షాప్స్ అటెంప్ట్ చేసిన తరువాత… వెండితెరపై హీరోగా తెరంగేట్రం చేశారు. స్కూలింగ్ అంతా వరంగల్ కంప్లీట్ చేసేసి… కాలేజీ చదువులను హైదరాబాద్ లో పూర్తి చేసిన యువ హీరో సంజోష్… బేవర్స్ సినిమా డైరెక్టర్ తో కొంత కాలం ప్రయాణం చేసి… అతని డైరెక్షన్ లోనే బేవర్స్ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ లాంటి విలక్షణ నటుడితో కలిసి నటించారు. ఆ సినిమాలోని తల్లి తల్లి నా చిట్టి తల్లి పాట ఇప్పటికీ ఎప్పటికీ మంచి ఆదరణ ఉన్న పాట. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజోష్ కి… ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో నటించాలనేది కోరిక. అందుకే ఇప్పుడు మళ్లీ తన రెండో సినిమాగా ‘సోదరా’లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన రెండు పాటలు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నిర్మాతలు త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇందులో అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సంపూ సినిమా అంటే ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇద్దరూ తెలంగాణ ప్రాంతవాసులే కావడం విశేషం. పవన్ కల్యాణ్ నటించిన ‘అన్నవరం’ సినిమాని స్కూల్ లైఫ్ లో చూసి… సినిమాల్లోకి రావాలని ఇన్స్ ఫైర్ అయ్యానని అంటున్నాడు సంజోష్. చిన్నప్పటి నుంచే పవన్ కల్యాణ్ ఫ్యాన్ గా పెరిగిన సంజోష్ కి… సినిమాలంటే ప్రాణం. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తన తదుపరి చిత్రాలకు ఎలాంటి కథలు ఎంచుకోబోతున్నాడు…? ప్రేక్షకులకు ఎలా దగ్గరవబోతున్నాడు అనేది వేచి చూడాల్సిందే. ఆల్ ది బెస్ట్ సంజోష్..!!!

Related posts

Leave a Comment