చిత్రం : రుద్రవీణ
రేటింగ్ : 3/5
విడుదల తేది : అక్టోబర్ 28, 2022
దర్శకత్వం : మధుసూదన్ రెడ్డి
నిర్మాత : లక్ష్మణ రావు రాగుల,
నటీనటులు:
శ్రీరామ్ నిమ్మల,ఎల్సా, శుభశ్రీ ,
రఘు కుంచే (విలన్) చలాకి చంటి,
సోనియా, రమణారెడ్డి తదితరులు
సాంకేతిక నిపుణులు:
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీను రాగుల
మ్యూజిక్ డైరెక్టర్ : మహావీర్
డి ఓ పి : జి ఎల్ బాబు
ఎడిటర్ : నాగేశ్వర్ రెడ్డి
ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్
కొరియోగ్రాఫర్ : మోహిన్,పైడిరాజు
ఆర్ట్ : గిరి
యాడ్స్ డిజిటల్ :మనోజ్ తడి
టాలీవుడ్ లో కొత్తధనంతో కూడిన కథలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అడపాదడపా కొన్ని ఫ్యామిలీ కథలు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కంటెంట్ తో కూడిన కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా వచ్చిన ‘రుద్రవీణ’ కూడా ఇదే కోవలోకి చెందుతుంది. రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రుద్రవీణ’. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు (అక్టోబర్ 28, 2022)న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే…
కథలోకి వెళదాం..
యానాం సిటీలో లాలప్ప (రఘు కుంచె) తన తమ్ముల్లు, ముత్తప్ప,కన్నప్ప లతో కలసి చాపల బిజినెస్ ముసుగులో , డ్రగ్స్, మర్డర్స్, మానభంగాలు చేస్తూ పెద్ద రౌడీ గా చెలామని అవుతుంటాడు. అదే యానాంలో ఒక వైపు రుద్ర (శ్రీ రామ్ నిమ్మల) చిన్న పిల్లలకు క్రికెట్ నేర్పిస్తూ కాలం వెళ్లబుచ్చుతుంటాడు. మరో వైపు లాలప్ప అనుచరులను రుద్ర హతమారుస్తుంటాడు. తన మనుషులను ఎవరు ఎందుకు చంపుతున్నారో తెలియక తికమకపడుతుంటాడు. అతడి కోసం ఊరంతా గాలిస్తుంటాడు. ఎల్సా (ప్రియ) జీవ హింస పాపం అంటూ అందరికీ చెపుతూ ఆర్గాన్ డొనేషన్ చేస్తే మరొకరికి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారని ట్రాఫిక్ దగ్గర ప్ల కార్డు పట్టుకొని అందరికీ చెప్పే క్రమంలో ట్రాఫిక్ లో రుద్ర కు తారస పడుతుంది. ప్రియను చూసిన రుద్ర మొదటి చూపులోనే ప్రేమలో పడడంతో చివరకు ప్రియ ను ప్రేమలో దింపుతాడు. మరో వైపు లాలప్ప తను చంపిన 26 మర్డర్ కేస్ లలో ఎవరైనా అబ్బాయిలు వున్నారా? అని ఎంక్వయిరీ చేయించగా అబ్బాయిలు లేరని తెలుసు కుంటున్న క్రమంలో రుద్ర తన ఇద్దరు తమ్ముళ్ళని చంపేస్తాడు. మరో వైపు జైల్లో ఉండే వీణ (శుభశ్రీ )కి ఉరిశిక్ష విధిస్తారు. ఇంతకీ ఆ వీణ ఎవరు? ఆమెను ఎందుకు ఉరి తీశారు? వీణ జైల్లో ఎందుకు ఉంది? రుద్ర లాలప్ప మనుషులను ఎందుకు మర్డర్ చేస్తుంటాడు? రుద్రకు వీణకు మధ్య సంబంధం ఏంటి? రుద్ర-వీణలు ఎందుకు కలసి ట్రావెల్ చేశారు అనేదే ఆసక్తి కలిగించే అసలు సిసలైన కథ.
నటీ నటుల పనితీరు ఎలావుందంటే…
హీరోగా చేసిన రుద్ర (శ్రీ రామ్ నిమ్మల) తన నటనతో ఆకట్టుకున్నాడు. అటు మాస్ ..ఇటు క్లాస్ రెండు షేడ్స్ వున్న పాత్రలలో చాలా చక్కగా రాణించాడని చెప్పొచ్చు. హెవీ ఎమోషన్ ఉండే పెద్ద క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. డాన్స్, ఫైట్స్ లలో కూడా మంచి ఈజ్ కనబరిచాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. చూడచక్కని ఫిజిక్ తో ఒకే అనిపించాడు. కథానాయికగ చేసిన ఎల్సా (ప్రియ) తన అందంతో యువతకు గాలం వేసింది. అలాగే వీరు తన లుక్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లలో యూత్ ను ఆకట్టు కుంటుంది. స్క్రీన్ పై రుద్ర, ప్రియ ల కెమిస్ట్రీ బాగా పండింది. అలాగే మరో నటి సోనియా లేడీ విలన్ గా మంచి పెర్ఫార్మన్స్ కనబరిచింది. లాలప్ప (రఘుకుంచె) ముఖంపై ఉన్న గాటు తో తన విలనిజంతో డిఫరెంట్ లుక్ తో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశాడు. విలన్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేసి నటుడిగా మంచి మార్కుల్ని కొట్టేశాడు. అలాగే చమ్మక్ చంద్ర తన హాస్యంతో నవ్వించాడు. ఇతర పాత్రల్లో నటించిన వారంతా తం తమ పాత్రల పరిధి మేరకు నటించి ఒకే అనిపించారు.
విశ్లేషణలోకి వెళితే…
దర్శకత్వం వహించిన మధుసూదన్ రెడ్డి ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించాడు. తను అనుకున్న కథని తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం సినిమాని ఆసక్తికరంగా నడిపించాడు. ప్రేక్షకులను ఆలోచింపజేసేలా కథనాన్ని మలిచినతీరు ఆకట్టుకుంటుంది. ఇక సాంకేతికత విషయాలకొస్తే.. నిర్మాత లక్ష్మణ రావు రాగుల ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని అందంగా తీర్చి దిద్దెందుకు పూర్తి సహకారాన్ని అందించినట్లు తెలుస్తోంది సినిమాని చూస్తే. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ కెమెరా పనితనం బావుంది. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ ఫర్వాలేదు. ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మొత్తం మీద ఈ ‘రుద్రవీణ’ ప్రేమతో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అలరించింది.