Ram Charan Blessed With Twins : మెగా కుటుంబంలో అద్భుత ఘడియలు

Ram Charan Blessed With Twins
Spread the love

* కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన
* గుడ్ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి

మెగా కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘడియలు రానే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ సంతోషకరమైన వార్తను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్‌, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారు. జనవరి 31 శుక్రవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక బాబుకి, ఒక పాపకి జన్మనివ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. మనవడు, మనవరాలు ఇద్దరూ ఒకేసారి తమ జీవితాల్లోకి రావడం పట్ల చిరంజీవి సురేఖ దంపతులు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భాన్ని ‘దైవిక ఆశీర్వాదం’గా మెగాస్టార్ అభివర్ణించారు. కొణిదెల కుటుంబంలో ఈ కొత్త వెలుగులు నిండటం పట్ల తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రస్తుతం తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు బిడ్డలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. చిరంజీవి ‘తాతయ్యగా మాకు ఇది అత్యంత సంతోషకరమైన సమయం. మా కుటుంబంలోకి ఈ చిన్నారులను ఆహ్వానించడం ఒక అద్భుతమైన అనుభూతి. మాపై ప్రేమను కురిపిస్తూ, ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని చిరంజీవి అన్నారు. మెగా వారసులు రావడంతో సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్న మెగాస్టార్ , లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రామ్‌ చరణ్‌ – ఉపాసన దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగా ట్విన్స్ పుట్టారనే వార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వారసుడు పుట్టినందుకు చిరంజీవి సైతం చాలా హ్యాపీగా ఉన్నారని అర్థమవుతోంది. ఇంట్లో అందరూ ఆడ పిల్లలే ఉండటంతో లేడీస్ హాస్టల్ వార్డెన్ గా ఉన్నట్లు ఉందని, ఒక్క వారసుడిని కనివ్వమని రామ్ చరణ్ తో చెబుతుంటానని చిరు గతంలో ఓ సినిమా ఈవెంట్ లో అన్నారు. ఆయన కోరుకున్నట్టుగానే ఇప్పుడు మెగా ఫ్యామిలీలోకి వారసుడు వచ్చాడు. రామ్ చరణ్ – ఉపాసనలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2012 జూన్ 14న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2023 జూన్ 20న వీరు క్లిన్ కారాకి జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు. ఇప్పుడు కవల పిల్లలకు జన్మనిచ్చి తమ కుటుంబాన్ని పెద్దదిగా మార్చుకున్నారు. ట్విన్స్ రాకతో మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మెగా ఫ్యాన్స్ తమ విషెస్ తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

Related posts