ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం (ఈ నెల 27న) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ – సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అయితే ఈ సారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామ్యం అయి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్ చేస్తాం. ఈ సారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్ తో ఉంటుంది. అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ – చిన్న సినిమాలను ప్రేక్షకులకు చేర్చడంలో మా మీడియా మిత్రులు ముందుంటారు. సుయోధన చిత్రాన్ని కూడా వారే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, సాయికుమార్ పోటాపోటీగా నటించారు. మా డైరెక్టర్ మాధవ్ సినిమా చేసిన విధానం చూస్తుంటే అనుభవం ఉన్న దర్శకుడిలా రూపొందించారు. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. అన్నారు.
డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ – సుయోధన మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడి నుంచి మిత్రులు మూవీ చాలా బాగుందంటూ ఫోన్స్ చేస్తున్నారు. ప్రియదర్శి, సాయికుమార్ గారి నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తోంది. మా సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు మీరు రీచ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు: ప్రియదర్శి, ద్రిషిక చందర్ , సాయి కుమార్, ప్రేమ, విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు
సాంకేతిక బృందం :
————————-
బ్యానర్ : ప్రజ్వల లైన్ క్రియేషన్స్
మ్యూజిక్ : జై క్రిష్
డీఓపీ : కార్తీక్ కొప్పెర
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ : బ్రహ్మ కడలి
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
నిర్మాత : బోసుబాబు నిడుమోలు
దర్శకత్వం: వై ఎస్ మాధవ్ రెడ్డి
పీఆర్ఓ – సతీష్ కె
ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ ‘సుయోధన’ మూవీ సక్సెస్ మీట్
