ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో ‘ప్రేమకు జై’

'Premaku Jai' hits theaters on April 11th
'Premaku Jai' hits theaters on April 11th
Spread the love

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది. అలా ఓ గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కిన మూవీ ‘ప్రేమ‌కు జై’. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 11న (శుక్ర‌వారం) థియేట‌ర్‌ల‌లో విడుద‌ల అవుతోంది. ఈ వైవిద్యమైన ప్రేమ కథ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌పై చూడ‌ని ఓ ల‌వ్‌స్టోరీని చూపించ‌బోతున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే వైర‌ల్‌గా మారాయి.
ఈ సంద‌ర్భంగా ‘ప్రేమకు జై’ దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ… ”పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత బాగా చేశారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఎంతో సహకరించారు. శుక్ర‌వారం థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌య్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.
అనిల్ బురగాని, ఆర్ జ్వలిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దుబ్బాక భాస్కర్ విలన్. ఈ చిత్రానికి ఎడిటర్: సామ్రాట్, సినిమాటోగ్రాఫర్: ఉరుకుందా రెడ్డి, సంగీతం: చైతు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం రాజేష్, సహ నిర్మాత: మైలారం రాజు, నిర్మాత: అనసూర్య, కథ – దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం.