ప్రభాస్ ‘సలార్‌’ విడుదలకి జాప్యం ఎందుకంటే…?

Prabhas' 'Salar' release delayed because...?
Spread the love

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ప్రభాస్‌ చిత్రం ‘సలార్‌’ సినిమా ఈనెలలో విడుదల కావాల్సి వుంది, కానీ ఇప్పుడు నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేదీ ఎపుడు అన్నది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అయితే ఈ సినిమాను ఎందుకు వాయిదా వేశారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఆ కారణం ఏంటో తెలుసా, ఈ సినిమాకి గ్రాఫిక్స్‌ వర్క్‌ అవకపోవటమే విడుదలకి జాప్యం అని తాజా సమాచారం ప్రకారం తెలిసింది. ఈ సినిమాలో గ్రాఫిక్‌ వర్క్‌ చాలా ఉందని, అది చేసి ఇవ్వటంలో జాప్యం జరిగిందని తెలుస్తోంది. మామూలుగా సినిమా గ్రాఫిక్‌ వర్క్‌ విడుదల తేదీకి ముందుగా అంటే ఒక నెల రోజులు ముందుగా ఆ పనులు పూర్తయిపోవాలి. ఎందుకంటే అందులో మళ్ళీ కరెక్షన్స్‌ ఏమైనా ఉంటే చెబుతారు, దాన్ని కూడా విడుదలకి ముందుగానే చేసే విధంగా ఉండాలి కాబట్టి, ఈ గ్రాఫిక్‌ వర్క్‌ అంతా కూడా నెలరోజుల ముందుగానే చేసేస్తారు. అయితే ఇప్పుడు ఈ ‘సలార్‌’ చిత్రానికి వచ్చేసరికి ఈ గ్రాఫిక్‌ వర్క్‌ పని ఇంకా పూర్తి కాలేదు. గ్రాఫిక్‌ టీమ్ నిరంతరం పని చేస్తున్నా కూడా ఆ వర్క్‌ ఈ నెల 15వ తేదీకి అవుతుందని, అయితే అప్పుడు మళ్ళీ అందులో కరెక్షన్స్‌ చెబితే అది విడుదలకి ముందు అవదు అని, అందుకనే తొందర పడటం ఎందుకని చిత్ర యూనిట్‌ ఈ సినిమాని వాయిదా వేశారని తెలుస్తోంది. ఇందులో శృతి హాసన్‌ కథానాయిక కాగా, శ్రియారెడ్డి , మలయాళం నటుడు పృథ్విరాజ్‌ సుకుమారన్‌ , జగపతి బాబు కూడా వున్నారు. ఒకసారి వాయిదా పడ్డాక.. ఇప్పుడు మళ్ళీ కొత్త విడుదల తేదీ ప్రకటించాలంటే అది హిందీ మార్కెట్‌ ని బట్టి ఉంటుంది అని కూడా తెలిసింది. ఎందుకంటే ఈ సినిమాకి హిందీ మార్కెట్‌ కూడా చాలా ప్లస్‌ కాబట్టి, హిందీ డిస్టిబ్యూట్రర్స్‌ తో చర్చించి కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం వుంది అని సమాచారం.

Related posts

Leave a Comment