‘పతంగ్‌’ ట్రైలర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌

'Patang' trailer success celebrations
Spread the love

ప్రతిష్టాత్మక సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్‌’ ప‌తంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. పాపులర్‌ దర్శకుడు నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌నువ విడుదల చేశారు. ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రమేకర్స్‌ ట్రైలర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా వంశీ పూజిత్ మాట్లాడుతూ ..ఈ చిత్రం ట్రైలర్‌ చూసిన వాళ్లందరూ మంచి రెస్పాన్స్‌ ఇచ్చారు. ట్రైలర్‌లో వున్న పాజిటివ్‌ వైబ్‌ సినిమాలో కూడా ఉంటుంది. ఈ చిత్ర సినిమాలో పతంగ్‌ పోటీల సీజీ కూడా వరల్డ్‌క్లాస్‌ లెవల్‌లో ఉంటుంది. యూత్‌ఫుల్‌గా కలర్‌ఫుల్‌గా మా సినిమా అందర్నిఎంటర్‌టైన్‌ చేస్తుంది అన్నారు. ప్రీతి పగడాల మాట్లాడుతూ.. పతంగ్‌లో నేను నటించడం ఎంతో ఆనందంగాఉంది. ట్రైలర్‌ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. ట్రైలర్‌ మ్యాజిక్‌ చేసింది. ట్రైలర్‌ నచ్చిన అందరికి సినిమా కూడా నచ్చుతుంది’ అన్నారు. ప్రణవ్‌ కౌశిక్‌ మాట్లాడుతూ ఈ సినిమా నాతో పాటు మా అందరికి చాలా టఫ్‌ అండ్‌ ఎమోషనల్‌ జర్నీ. సినిమా అంటే లవ్‌తో సినీ పరిశ్రమలో వచ్చాను. ఈ జర్నీలో అన్ని ఫేస్‌ చేశాం. నన్ను అందరూ ప్రేమించారు. మొదట్లో కెరీర్‌లో  అన్ని హ్యపీగా అనిపించాయి. కానీ ఇప్పుడు అంతా ఈజీ కాదు అనిపించింది. కైట్స్‌ స్పోర్ట్స్‌ డ్రామాను తీయడం అంతా ఈజీ కాదు. ఈ సినిమా చూస్తు మా దర్శక, నిర్మాతల కష్టం మీకు తెలుస్తుంది. ఈ ట్రైలర్‌ చూసి విమర్శించిన వాళ్లు కూడా ప్రశంసించారు. దర్శకుడు చాలా కష్టపడి తీశాడు. తప్పకుండా ఆడియన్స్‌ మమ్ములను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 25న విడుదలైన అన్ని సినిమాలు ఆడాలి. సినిమా గెలవాలి అన్నారు. పతంగ్‌ రోలర్‌ కోస్టర్‌లా మా సినిమా నిర్మాణం కూడా జరిగిందని, పతంగ్‌ జర్నీ గ్రేట్‌ జర్నీ అని  నిర్మాత విజయ్‌శేఖర్‌ అన్నే తెలిపారు. సురేష్‌ కొత్తింటి మాట్లాడుతూ..డీలే అయినా ఓ మంచి క్వాలిటీ సినిమా తీశామనే నమ్మకం ఉంది. అందరూ మంచి కమిట్‌మెంట్‌తో యూనిటీగా చేసిన సినిమా ఇది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. నిర్మాత రమ్య మాట్లాడుతూ.. ఈ యంగ్‌బ్యాచ్‌ ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు. ఈ సినిమా కంటెంట్‌ను నమ్మి నేను ఈసినిమాతో అసోసియేట్‌ అయ్యాను. ఫెస్టివ్‌ మూడ్‌కు సెట్‌ అయ్యే సినిమా అని అందరూ అంటున్నారు. చిన్న సినిమాకు ఉండాల్సిన  కష్టాలు ఈ సినిమాకు ఉన్నాయి. ప్రతి రోజు ఓ కొత్త చాలెంజ్‌ను ఫేస్‌ చేస్తున్నాం. సినిమా చూసిన అందరూ సినిమా గురించి ఎంతో ప్రశంసిస్తున్నారు. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని నమ్మకం ఉంది అన్నారు. మరో నిర్మాత సంపత్‌ మకా మాట్లాడుతూ.. కంటెంట్‌ నమ్మి ఈసినిమాను నిర్మించాం. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా టఫ్‌ కాంపీటిషన్‌ ఉంది. మా సినిమా ఈ సంవత్సరం విడుదలై విజయం సాధించిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందనే విశ్వాసం వుంది అన్నారు. ఈసమావేశంలో మరో నిర్మాత నాని బండ్రెడ్డి కూడా పాల్గొన్నారు.

Related posts