తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ సెంట్రల్ (రాష్ట్ర) మహిళా విభాగం అదనపై చైర్ పర్సన్ గా కొత్త శ్రీ ప్రియను నియమించారు. రాష్ట్ర చైర్ పర్సన్ డా. జి. దీపారెడ్డి అసోషియేషన్ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. వరంగల్ జిల్లా హనుమకొండ సుబేదారిలో ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో వ్యవ సాయ అధికారిణిగా పనిచేస్తున్న కొత్త శ్రీప్రియను తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం ఛైర్ పర్సన్ గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లి లోని ఆ సంఘ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమెకు ఇందుకు సంబంధించిన నియామకఉత్తర్వులను అందజేశారు. గతంలో వరంగల్ జిల్లాలో ఉమెన్స్ డే వంటి పలు విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవార్డును సైతం అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం చైర్ పర్సన్ గా నియామకం పొందిన కొత్త శ్రీప్రియ మాట్లాడుతూ.. నాపై ఎంతో నమ్మకంతో చైర్ పర్సన్ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని గెజిటెడ్ అధికారుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ఫ్ (టీజీవో) భవన్‌లో టీజీవో ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబరాలను జయప్రదం చేయాలని ఆమె కోరారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో టీజీవో జాతీయ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్త శ్రీప్రియ మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం చైర్ పర్సన్ గా కొత్త శ్రీప్రియ నియామకం
 
			
 
                             
                            