‘తండేల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. పెళ్లి అయిన అనంతరం తొలిసారి తన భార్య శోభితా ధూళిపాళ్లతో కలిసి ఇంటర్‌నేషనల్ ట్రిప్ యూరప్ వెకేషన్‌కు వెళ్లగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను శోభితా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇద్దరి కలిసి ఫుడ్ తింటున్న ఒక ఫొటోను పోస్ట్ చేయడంతో పాటు దీనికి ‘వైబ్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వైరలవుతున్న ఈ ఫొటోను మీరు చూసేయండి. సమంతతో విడాకుల అనంతరం చైతూ శోభితాతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన అనంతరం నాగ చైతన్య తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో ట్రిప్ వెళ్లకుండా సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసింది ఈ జంట. ఇప్పుడు సినిమాల నుంచి విరామం తీసుకున్న చైతూ తాజాగా హనీమూన్ ట్రిప్ వెళ్లినట్లు తెలుస్తుంది. సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల తండేల్‌తో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చైతూ ప్రస్తుతం విరుపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో ఒక సినిమా చేయబోతున్నాడు. మైథాలాజికల్ సైన్స్ ఫిక్షన్‌గా రాబోతున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది.
‘హనీమూన్’కు వెళ్లిన నాగచైతన్య దంపతులు… ఫొటోలు వైరల్
