‘కీడా కోలా’తో నా కల నెరవేరింది : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం

My dream came true with Keeda Cola : Director Tarun Bhaskar Dasyam
Spread the love

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై అంచనాలని పెంచింది. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం ‘దీక్ష’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ వివరాలు…

‘కీడా కోలా’ ఐడియా ఎప్పుడు.. ఎలా వచ్చింది?
లాక్ డౌన్ చాలా మంది రకరకాలుగా వినూత్నంగా డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసి నాకు చాలా కామెడీ గా అనిపించింది. రోడ్ పై మ్యాన్ హోల్ కవర్ లేదు. ఎవడో ఇనపసామాన్లు వాడికి అమ్మేసాడట. వాడిని సినిమాల్లోకి ఎక్కించాలనిపించింది (నవ్వుతూ). ఇంకా సంపాయించడానికి మార్గాలు ఏమున్నాయని అడిగితే.. తినే పదార్ధాలలో పురుగు పడిందని కేసు వేసి కూడా సంపాదించవచ్చని ఫ్రెండ్స్ చెప్పారు. ఇలా చాలా ఆసక్తికరమైన చర్చనడిచింది. అయితే ఇదంతా క్రైమ్. కానీ దూరం నుంచి చూస్తే కామెడీ. ప్రతి క్రైమ్ దూరం నుంచి చూస్తే కామెడీనే. ఇది నా ఫేవరేట్ జోనర్ కూడా. అక్కడ నుంచి కీడా కోలా ఆలోచన వుంది. చిన్నప్పటినుంచి నా ఫేవరేట్ జోనర్ ఇది. నా ఆల్ టైం ఫేవరేట్ మనీమనీ. అందులో బ్రహ్మానందం గారి పాత్ర చాలా ఇష్టం. అలాగే జిగర్తండా, సుదుకవ్వం చిత్రాలు కూడా చాలా ఇష్టం. రొమాంటిక్ కామెడీలు నాకు బోరింగ్ సబ్జెక్ట్. నాతో పాటు నా ఫ్రెండ్స్ కి కూడా క్రైమ్ కామెడీలే ఇష్టం. ఇప్పుడీ సినిమాతో క్రైమ్ కామెడీ కల నిజమైయింది.

మొదటి సినిమాకే జాతీయ అవార్డ్ అందుకున్నారు కదా.. ఫిలిం మేకర్ గా ఎలాంటి భాద్యత ఏర్పడింది ?
‘బాధ్యత’ లాంటి మాటలు విన్నప్పుడే చాలా బరువుగా వుంటుంది. నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత కొంచెం బరువైయింది. (నవ్వుతూ) ఆ బరువుని పక్కన పెడదామని ‘ఈ నగరానికి ఏమయింది’ చేశాం. ఈ సినిమా ఇంకా బరువుని పెంచింది. ( నవ్వుతూ)
బ్రహ్మనందం గారికి పెయింట్ ని ప్రజెంట్ చేశారు కదా.. దాని గురించి చెప్పండి ?
ఎందులో ఆయన పెయిటింగ్ వేసి ప్రజెంట్ చేయాలని అనిపించింది. మూతి కొంచెం వంకరగా వచ్చింది. వంకరగా తిప్పి పెయిటింగ్ చూపించా. ఆయన వంకరగా చూశారు. ఎలావుందని అడిగాను. ‘నా మొహంలా వుంది’అని చెప్పారు. ఆయన తిట్టారా ? పొగిడారా ? ఈ రోజు వరకూ అర్ధం కాలేదు. (నవ్వుతూ) ఆయన అద్భుతమైన పెయింటర్. నాకు హనుమాన్ పెయిటింగ్ ని బహుమతిగా ఇచ్చారు.

మీ సినిమాలు వాస్తవానికి దగ్గరగా వుంటాయి.. కీడాకోలా ఎలా వుంటుంది ?
గత రెండు సినిమాలతో పోల్చుకుంటే ఇందులో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. పెళ్లి చూపుల్లో ప్రతిది లాజికల్ గా వుంటుంది. కీడాకోలా లో గన్స్ షాట్స్, బ్లాస్ట్స్ ఇలా చాలా వరకూ సినిమాటిక్ లిబర్టీ వుంటుంది.

సినిమాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయి కదా.. ఈ విషయంలో మీరు ఎంత భాద్యతగా కథల రూపకల్పన చేస్తారు?
సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందనే చెప్పాలి. నా కథలు పాత్రల విషయంలో భాద్యతగా వుంటాను. ఈ నగరానికి ఏమైంది చిత్రం వివేక్ పాత్ర గురించి వుంటుంది. చివర్లో తను స్నేహం కోసం మందుని వదిలేస్తాడు. అదేదో మెసేజ్ ఇవ్వాలని కాదు.. నాకు చెప్పాలనిపించింది చెప్పడానికి ప్రయత్నిస్తాను.

కీడా కోలా నటీనటుల ఎంపిక గురించి చెప్పండి ?
ఇందులో అందరు నటీనటులని ఆడిషన్స్ చేసి తీసుకున్నామని గర్వంగా చెప్పగలం. జీవన్, విష్ణు.. ఇలా అందరిని ఆడియన్స్ చేసే ఎంపిక చేశాం.
ఇక ఇందులో నటించిన హ్మానందం గారు, రఘుగారు నాకు ఆదర్శమైన నటులు. రఘుగారు రోడీస్ లో బ్యాడ్యాస్ క్యారెక్టర్ వుంటుంది. అదే ఇందులో చేయాలి కాబట్టి నేచురల్ వచ్చింది.

బ్రహ్మానందం పాత్రకు స్ఫూర్తి ఉందా?
బ్రహ్మానందంగారి గారి పాత్రకు మా తాతయ్య స్ఫూర్తి. మా తాతయ్య నాకు మంచి ఫ్రెండ్. ఆయనది చాలా ఫన్ క్యారెక్టర్. ఆ పాత్రకు బ్రహ్మనందం గారైతే బావుంటుదనిపించింది. ఆయన అద్భుతంగా చేశారు. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

కీడా కోలా విషయంలోచాలా నమ్మకంగా వున్నారు.. విజువల్ తో కూడా నవ్వుతారని చెబుతున్నారు.. ఇంత నమ్మకం ఎలా వచ్చింది ?
ముంబైలో ప్రివ్యూ చూసినప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు హాయిగా నవ్వుకున్నారు. యూనిక్ రైటింగ్, మేకింగ్ తో నవ్విస్తున్నాం. ఖచ్చితంగా ప్రేక్షకులు పైసా వసూల్ అని ఫీలౌతారనే నమ్మకం వుంది.

వాస్తు పాత్రకు టూరెట్ సిండ్రోమ్ పెట్టారు కదా.. దాని ద్వారా ఏదైనా సందేశం ఇవ్వాలని భావించారా ?
ఏదైనా వైకల్యం వుంటే దాని గురించి ప్రొటెక్ట్ చేస్తూ మాట్లాడటం కాదు.. వారికి సాధికారత ఇచ్చే విధంగా ఉండాలనేది నా ఆలోచన. ఇందులో అంతర్లీనంగా ఆ సందేశం వుంటుంది.

మీరు రాసుకునే పాత్రల్లో మీకు దగ్గరగా వుండే పాత్రలు ఏమిటి ?
ప్రతి పాత్రల్లో ఎంతో కొంత నాకు నేను కనిపిస్తాను. కానీ ఇందులో నాయుడు పాత్ర రాసినప్పుడు నాలో వుండే భారం తగ్గిపోయినట్లు అనిపించింది. అది నేను అనుభవించాను. నాయడు పాత్రలో నాకు నేను కనిపించాను.

ట్రైలర్ లో చైనా బొమ్మ కనిపిస్తుంది.. దాని నేపధ్యం ఏమిటి ?
నాకు తెలిసిన ఒక మెడికల్ రిప్రజెంటర్ వున్నారు. ఆయన ఒక సిమ్యులేటర్ ని కార్ లో పెట్టుకొని పెళ్లి సంబంధానికి వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు కార్ ని ఆపి ఆ సిమ్యులేటర్ ఏమిటని ప్రశ్నించారు. దీంతో రోడ్ మీదే దాని పనితీరు చూపించాల్సి వచ్చింది. అది చూసి పెళ్లి వాళ్ళు మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నారు. అది చాలా ఆసక్తికరమైన సంఘటన అనిపించింది. దానిని స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది.

పాత్రలు రాసుకున్నప్పుడు మీ ఆలోచన ధోరణి ఎలా వుంటుంది ?
జీవితాన్ని ప్రతి కోణం నుంచి చూడాలని రైటింగ్ నేర్పించింది. ప్రతి పాత్రలోకి వెళ్లి అలోచించడం అవసరం. ప్రతి పాత్రలో లోతుగా అలోచించినపుడు ఒక హ్యుమానిటీ వుంటుంది. సినిమా, జీవితం.. ఈ రెండిట్లో ఒక సానుభూతితో వుంటే లైఫ్ ఇంకా మెరుగ్గా వుంటుంది. సినిమాలో చూపించిన పాత్రలతో మనుషులు మారుతారని నా నమ్మకం.

పోస్టర్ లో చైతన్యని ఎక్కువ చూపిస్తున్నారు .. ఇతనేనా హీరో ?
ఇందులో మొత్తం ఎనిమిది పాత్రలు వున్నాయి. అందులో హీరో ఎవరనేది నేను మా రైటింగ్ టీం బెట్ వేసుకున్నాం. ఆడియన్స్ ఎవరిని హీరో అంటారో అని. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్.( నవ్వుతూ)

మీ దర్శకత్వంలో మీరు నటిస్తున్న మొదటి సినిమా ఇది.. మీరే హీరో అనుకోవచ్చా ?
అలా ఐతే కేవలం నా ఫోటోనే వేసుకుంటాను కదా( నవ్వుతూ) అయితే నేను రాసిన పాత్రల్లో నాయుడు నా ఫేవరేట్.

సినిమా నిడివి కేవలం రెండు గంటలే వుంది కదా ?
అవును.. రాసుకున్నపుడు, తీసినప్పుడు కూడా రెండు గంటల ఇరవై నిముషాలు వచ్చింది. పదిహేను నిముషాలు ట్రిమ్ చేశాను. క్రైమ్ కామెడీ నేచర్ క్రిస్ప్ గా వుండటం. నెరేటివ్ పరిగెడుతూనే వుంటుంది. కీడాకోలా కూడా ఫాస్ట్ పేస్డ్ అండ్ యూనిక్ గా వుంటుంది.

గతంలో వెంకటేష్ గారితో ఒక సినిమా అనుకున్నారు కదా ?
అవును. ఆ సినిమా వుంటుంది. సురేష్ బాబు గారు ప్రొసీడ్ అవ్వమన్నారు. అయితే కథ కోసం మరింత సమయం తీసుకున్నాను. ఇప్పుడు సిద్ధంగా వున్నాను. అలాగే ఒక వెబ్ సిరిస్ కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Related posts

Leave a Comment