భీమిలిలో మిస్టర్ వర్క్ ఫార్మ్ హోమ్ సినిమా బృందం సందడి

Mr. Work Farm Home movie team creates buzz in Bhimili
Spread the love

శనివారం భీమిలి తిమ్మాపురం లో విశాఖ ఫిల్మ్ నగర్ సెంటర్ లో మిస్టర్ వర్క్ ఫ్రొమ్ హోమ్ సినిమా బృందం ప్రీ రిలీజ్ వేడుక ను ఘనంగా నిర్వహించారు . ఈ సినిమా ను అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మధు దర్శకత్వం వహించగా, త్రిగున్ హీరోగా పాలయి రాధా కృష్ణ హారోహిన్ గా నటిస్తున్నారు.దర్శకుడు మధు మాట్లాడుతూ ఈ సినిమా వ్యవసాయంలో నూతన యంత్ర పరికరాలు వినియోగ ఆధారిత నేపథ్యంలో కధ నడుస్తుంది అని అన్నారు. గ్రామీణ వ్యవసాయ కుటుంబం లో జన్మించిన ఒక యావకుడు, యువతి ప్రేమ పెళ్లి వ్యవహారం, వినోదం కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అని అన్నారు. హీరో త్రిగున్ మాట్లాడుతూ ఈ సినిమా నేటి తరానికి చాలా అవసరం అని భావి తరాలకు ఈ సినిమా ఒక మెస్సేజ్ అందించే లా ఉంటుంది అని అన్నారు. సినిమా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రం ప్రజలు ప్రశంసలు అందుకునేలా ఉంటుంది అని దర్శకుడు మధు ఈ సినిమా బాగా వచ్చే లా సినిమా తీశారు అని చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 13 న రిలీజ్ ఉంటుంది అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో చిత్ర బృందం పాల్గొంది.

Related posts